: శాసనమండలిలో వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డ శైలజానాథ్
రాష్ట్రం విడిపోతే రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్సార్సీపీ చూస్తోందని మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం ఆ పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఎలాగైనా విడదీయాలనే ద్రోహ బుద్ధితోనే ఆ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. అందుకే సభలో విభజన బిల్లుపై చర్చను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ రోజు శైలజానాథ్ శాసనమండలిలో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని... కానీ, ఇంతవరకు సమాచారం అందలేదని స్పష్టం చేశారు.