: పాక్ లో ఉగ్రవాదాన్ని నియంత్రించలేం: ముషారఫ్


ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నపాకిస్థాన్ లో దానిని నియంత్రించడం కష్టతరమని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పాక్ లో ఉగ్రవాద శిబిరాలను నియంత్రించడం కూడా చాలా కష్టసాధ్యమని చెబుతున్నారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన ముషారఫ్ ఈ మేరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు.

కాశ్మీర్ లో తీవ్రవాదం అంతకంతకూ పెచ్చుమీరి పోతుండడం, అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెదొలగనుండడంపై ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తాను విధించుకున్న బహిష్కరణలో భాగంగా ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్ లో ఆశ్రయం పొందుతున్నారు. పాక్ కు తిరిగి రానున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News