: పూణే వ్యభిచార గృహాలపై దాడి.. 40 మంది ఆంధ్రా అమ్మాయిలకు విముక్తి


ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సీఐడీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో 40 మంది ఆంధ్రా అమ్మాయిలకు విముక్తి లభించింది. మహిళల అక్రమరవాణాపై దృష్టి పెట్టిన పోలీసులు సీఐడీ పోలీసులతో కలసి మహారాష్ట్ర, పూణేలోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. దీంతో 8 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులను అరెస్టు చేసి, అక్కడ మగ్గుతున్న 40 మంది యువతులకు విముక్తి కల్పించారు. వెంటనే వారిని హైదరాబాద్ తరలించారు. ఈ సాయంత్రం వారు హైదరాబాద్ చేరుకోనున్నారు.. ఇక్కడి నుంచి వారిని సొంత ఊర్లకు పంపించనున్నారు.

  • Loading...

More Telugu News