: బయట ఎన్ని తిట్టుకున్నా మేమంతా ఒక్కటే: ఎర్రబెల్లి
పార్టీల పరంగా తెలంగాణ ప్రాంత నేతలు ఎంత తిట్టుకున్నా శాసనసభలో తామంతా ఒక్కటేనని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రేపు అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ మొదలవుతుందని, చర్చతోపాటే కుట్రలు కూడా మొదలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై ఓటింగ్ పెట్టేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని, అయితే తాము వాటిని తిప్పికొట్టగలమని ఎర్రబెల్లి తెలిపారు.