: గవర్నర్ కు ఎమ్ఆర్ఐ స్కాన్
గవర్నర్ నరసింహన్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. గవర్నర్ కు చేస్తున్న వైద్యపరీక్షలను నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ పర్యవేక్షించారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ రామ్మూర్తి ఆయనకు ఎమ్ఆర్ఐ స్కాన్ పరీక్ష చేశారు. న్యూరాలజీ విభాగాధిపతి కూడా ఆయనను పరీక్షించారు. గవర్నర్ కు అనారోగ్యం ఏమీ లేదని, ఇవన్నీ ఆయన సాధారణంగా చేయించుకునే పరీక్షలేనని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.