: 'లైఫ్ ఆఫ్ పై' కథానాయిక రహస్య వివాహం


ఆంగ్ల చిత్రం 'లైఫ్ ఆఫ్ పై' లో కథానాయికగా నటించిన శర్వంతి వ్యాపార వేత్త సమీర్ భరత్ రామ్ ను రహస్యంగా పెళ్లాడింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా నిరాడంబరంగా వివాహం జరిగినట్లు సమాచారం. చెన్నైకు చెందిన ఈ భామ, సమీర్ భరత్ మధ్య కొంతకాలం నుంచి ప్రేమాయణం సాగుతోంది. ఈ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అందుకే ఎవరికి చెప్పలేదని తెలుస్తోంది. అయితే, వివాహం తర్వాత ఆమె నటనకు ఎలాంటి ఆటంకం ఉండదని, తమిళంలో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయని స్నేహితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News