: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని కేజ్రీవాల్ కు హజారే సూచన
ఓ వైపు 2014 లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సామాజిక కార్యకర్త అన్నా హజారే మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్ కు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించే దానిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఓ ఆంగ్ల చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన హజారే, ఇప్పటివరకు కొన్ని అవసరాలు తీర్చడం పూర్తయ్యాయని.. ప్రజలను రక్షించేందుకు ఇంకా చాలా శాసనాలు చేయాల్సి ఉందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపర్చాల్సి ఉందని పేర్కొన్నారు.