: బిల్లుపై ఓటింగ్ పెట్టించే అధికారం సీఎంకు లేదు: ఈటెల
రాష్ట్రానికి తెలంగాణ బిల్లు వచ్చి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు చర్చను ప్రారంభించలేదని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. చర్చ జరగకుండా సభను అడ్డుకుంటున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుపై ఓటింగ్ పెట్టించే అధికారం సీఎం కిరణ్ కు లేదని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు.