: క్యాచ్ ఖరీదు 51 లక్షలు!


న్యూజిలాండ్ లో క్రికెట్ అభిమానికి జాక్ పాట్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్నందుకు అతను భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. న్యూజిలాండ్, వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా కీరన్ పావెల్ కొట్టిన బంతిని గ్యాలరీలో ఉన్న మైఖేల్ మోర్టాన్ అనే వీక్షకుడు ఒడిసిపట్టుకున్నాడు. బ్రివర్ తుయ్ సంస్థ స్పాన్సర్ షిప్ లో భాగంగా ఆరెంజ్ టీ షర్టు ధరించి ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకున్న వీక్షకులకు మంచి బహుమతినిస్తామని మ్యాచ్ ముందు ప్రకటించింది. దీంతో తనపై నుంచి వెళ్తున్న బంతిని పట్టుకున్న మైఖేల్ మోర్టాన్ ని ఈ బహుమతి వరించింది.

దీని ప్రకారం అతనికి 83 వేల డాలర్లు అంటే సుమారు 51 లక్షల రూపాయలను బ్రివర్ తుయ్ అందజేయనున్నట్టు ప్రకటించింది. దీంతో బహుమతి గెల్చుకున్న మోర్టాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన తండ్రితో మ్యాచ్ చూస్తుండగా బంతిని పట్టుకున్నానని, ఇంత పెద్ద మొత్తం తన వశమవుతుందని అనుకోలేదని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News