: ప్రమాదం నుంచి బయటపడని సుచిత్రా సేన్ ఆరోగ్యం
ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రా సేన్(82) ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని కోల్ కతాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 'బెల్లి వ్యే' క్లినిక్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఈ రోజు వైద్య బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఐసియూలోనే ఆమెను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. దాంతో, సేన్ కు వెంటిలేషన్ కొనసాగిస్తున్నామని, అందుకే విషమ పరిస్థితి నుంచి బయటపడ్డట్లు ఇప్పుడే చెప్పలేమని వివరించారు.