: పది రూపాయల కోసం నిండు ప్రాణం తీశారు!
ఆస్తులు, బంగారం కోసం హత్యలు జరగడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే, కేవలం పది రూపాయల కోసం హత్య జరగడం మనుషుల్లో పెరుగుతున్న రాక్షసప్రవృత్తికి నిదర్శనం అని సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి బీహార్ లోని కతిహర్ పట్టణంలో గుట్కా ప్యాకెట్ కొనుక్కునేందుకు యాదవ్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు పది రూపాయలు అడిగారు. అతను నిరాకరించడంతో ఆగ్రహించిన నలుగురు దుండగులు అతనిని అత్యంత దారుణంగా కత్తులతో కుళ్ళ పొడిచారు. దీంతో యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పది రూపాయల కోసం ఇంత దారుణమా? అంటూ నిందితులను తక్షణం పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.