: ఆగ్రహించిన తండ్రితో అళగిరి భేటీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధితో ఆయన కొడుకు అళగిరి సమావేశమయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నటుడు విజయ్ కాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమిళనాడులో సాధ్యమైనన్ని స్థానాలు గెలుచుకోవాలన్నది కరుణ వ్యూహం. దీనికి వ్యతిరేకంగా అళగిరి వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన కరుణానిధి.. పార్టీ క్రమశిక్షణ తప్పితే బహిష్కరించాల్సి ఉంటుందని గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అళగిరి హుటాహుటిన తన తండ్రి కరుణను కలుసుకుని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.