: విప్ ధిక్కరించిన టీడీపీ ఎమ్మెల్యే
సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తటస్థంగా ఉండాలంటూ తెలుగుదేశం జారీ చేసిన విప్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి ధిక్కరించారు. శాసనసభలో ఈ ఉదయం టీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆయన మద్దతు తెలిపారు. దీంతో హరీశ్వర్ రెడ్డిపై పార్టీ క్రమ శిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.