: భారత్ లో ఇంటర్నెట్ 78శాతం నిదానం
ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 4 ఎంబీపీఎస్ కంటే తక్కువే ఉంది. మరి అదే బ్రిటన్ లో 'ఈఈ' అనే సంస్థ 300ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగంతో అందిస్తోంది. బ్రిటన్ వ్యాప్తంగా సగటున 30 ఎంబీపీఎస్ వేగానికి తక్కువ కాకుండా ఇంటర్నెట్ ను అందిస్తోంది. స్పీడ్ టెస్ట్ డాట్ నెట్ ఈ వివరాలను వెల్లడించింది. వాషింగ్టన్ డీసీలో సగటున 85 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ కొరియాలో 53 ఎంబీపీఎస్, హాంగ్ కాంగ్ లో 65 ఎంబీపీఎస్ వేగంతో సేవలు అందుతున్నాయి. భారత్ లో 4జీ సేవల లైసెన్స్ సొంతం చేసుకున్న రిలయన్స్ జియో సగటున 49 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని గతంలో ప్రకటించింది. అవి ప్రారంభం అయితేగానీ దేశంలో నెట్ వేగం పుంజుకునేలా లేదు.