: ఇస్రో శాస్త్రవేత్తలకు శాసనమండలి అభినందనలు
జీఎస్ఎల్వీ-డి5ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు శాసనమండలి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ చక్రపాణి సహా సభలోని సభ్యులందరూ చప్పట్లతో తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సభ్యులు ఛైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఆయా సభ్యులు వారి అభిప్రాయాలను అందజేస్తే బీఏసీలో చర్చిస్తామని చక్రపాణి తెలిపారు. అయితే, ఆయన మాటలు పట్టించుకోని సభ్యులు.. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు చేశారు.