: సోనియా ఆదేశాల మేరకే జగన్ పనిచేస్తున్నారు: గాలి ముద్దుకృష్ణమ
సోనియా ఆదేశాల మేరకే వైఎస్సార్సీపీ అధినేత జగన్ పనిచేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలాగైనా విభజించాలనే ఉద్దేశంతోనే జగన్ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఓట్లు, సీట్లు, పదవుల కోసమే వీరంతా కలసి నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మినారాయణకు ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదని... దీన్నిబట్టి కాంగ్రెస్ కు, వైఎస్సార్సీపీకి ఉన్న ఒప్పందాలేంటో అర్థమవుతాయని చెప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లును తాము వ్యతిరేకిస్తామని గాలి చెప్పారు. బిల్లుపై చర్చించడానికి అవసరమైన సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా... ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు.