: కారును లోయలోకి తోసేసి, యాక్సిడెంట్ డ్రామా ఆడిన నటి!
సినీనటులు సినిమాల్లోనే కాకుండా బయట కూడా అద్భుతంగా నటిస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఎవరికీ చెప్పకుండా అదృశ్యమై కలకలం రేపుతున్నారు. ఆ మధ్య నటి అంజలి మిస్సింగ్ వార్త టాలీవుడ్, కోలీవుడ్ లను కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరాఠా నటి అల్కాపునేశ్వర్ డిసెంబర్ 27న స్టేజ్ షో కోసం వెళ్తూ నవీ ముంబైలో అదృశ్యమైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పూణేకు సమీపంలో ఖోపోలీ వద్ద 700 అడుగుల లోతైన లోయలో ఆమె కారు దొరికింది.
దీంతో అల్కా స్నేహితుడ్ని, కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో అల్కా కారుకు యాక్సిడెంట్ జరగలేదని, ఆమే కారును లోయలో తోసేసి యాక్సిడెంట్ డ్రామా ఆడిందని అంటూ ఆమె ఫోన్ నెంబర్ అందజేశారు. దీంతో ఆమె ఫోన్ నంబర్, కాల్ లిస్టు ఆధారంగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో చెన్నైలో ఉంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు ప్రకటించారు.