: టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి
వాయిదా అనంతరం 10గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంగీకరించారు. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఐ మద్దతు తెలిపాయి.
మొత్తం సభలో 45 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాసంపై బీఏసీలో చర్చించేందుకు సభాపతి నాదెండ్ల మనోహర్ శాసనసభను అరగంట పాటు వాయిదా వేశారు. అవిశ్వాసంపై సభలో ఎప్పుడు చర్చ చేపట్టాలన్న విషయాన్ని ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.