: విభజనను రహస్య అజెండాగా కొనసాగిస్తున్నారు: ధూళిపాళ్ల
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? విభజన అవసరమేమిటి? అన్న విషయాలు సభతో పాటు, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరముందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని రహస్య అజెండాగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లులోని అంశాలపై సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్రమైన వివరాలు అందించి, అర్థవంతమైన చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.