: మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించిన ఏబీవీపీ.. పరిస్థితి ఉద్రిక్తం


విద్యార్థుల హక్కులను పరిరక్షించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను తక్షణమే చెల్లించాలని, రీయింబర్స్ మెంట్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయరాదని డిమాండ్ చేస్తూ, ఆందోళనకు దిగారు. అంతేకాకుండా క్వార్టర్స్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం తలెత్తింది. ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనను తీవ్రతరం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News