: డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం


డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల రైల్వే శాఖ సహాయ మంత్రి మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్ తెలిపారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 50వేలు ప్రకటించారు. రైల్వే భ్రదతా కమిషనర్ ప్రమాదంపై విచారణ నిర్వహిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News