: శాసనమండలికి మంత్రుల గైర్హాజరు.. మండిపడుతున్న విపక్షాలు
శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభకు ఏ ఒక్క మంత్రి కూడా హాజరుకాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రులు లేకపోవడం సభను అవమానించినట్టేనని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. మంత్రులు సభలో లేకపోవడాన్ని విపక్షాలన్నీ తప్పుబట్టాయి. రాజ్యాంగబద్ధంగా పని చేయని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. మంత్రులు హాజరయ్యేదాకా సభను వాయిదా వేయాలని అన్ని పార్టీల సభ్యులు ఛైర్మన్ ను కోరారు. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాణి సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.