: పాట్నా గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. తల్వార్లతో దాడి
సిక్కుల పవిత్ర క్షేత్రం పాట్నా గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సిక్కుల పదో మత గురువైన గురుగోవింద్ సాహెబ్ 347వ జయంతి సందర్భంగా మరో మూడేళ్లలో భారీ ఎత్తున జరుపనున్న 350వ జంత్యుత్సవాలకు ఎవర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే విషయంపై నిర్వహించిన సమావేశం హింసకు దారితీసింది. సమావేశంలో పాల్గొన్న సిక్కులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర ఘర్షణకు దిగారు. సిక్కుల దగ్గర ఉండే తల్వార్లను ఈ ఘర్షణకు వినియోగించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.