: హోం గార్డులకు శుభవార్త
హోం గార్డులకు పోలీసు శాఖ సంక్రాంతికి శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న వేతన పెంపు ఫైలుకు కదలిక వచ్చింది. హోం గార్డుల వేతనాన్ని రోజుకు 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచుతూ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 22 వేల మంది హోం గార్డులకు లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు.