: తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పకపోతే ఒప్పుకున్నట్టే!: ఉండవల్లి


తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ను వ్యతిరేకించినా లేక బిల్లును యధాతధంగా తిప్పి పంపినా రాష్ట్ర విభనను అంగీకరించడమేనని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ లోని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంట్లో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి పంపిన బిల్లు కనుక విలువ ఎక్కువ ఉంటుందని తెలిపారు. అలాంటి బిల్లుపై అభిప్రాయం చెప్పకపోతే నష్టం ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి జరిగే చర్చలో బిల్లుపై క్లాజుల వారిగా చర్చ చేపట్టాల్సిందేనని, అవసరమైతే ఓటింగ్ కూడా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న రెండు వాదాలు దేశచరిత్రలోనే ప్రధమమైనవని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News