: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాదులో ఉన్న మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఉండవల్లి అరుణ్ కుమార్, వట్టి వసంతకుమార్, గాదె వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. విభజన బిల్లుపై శాసనసభలో చర్చ గురించి వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.