: తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమలలో మళ్లీ భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనంకోసం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి అత్యధికంగా 12 గంటల సమయం పడుతోంది. దాంతో క్యూలో భక్తుల వరుస మరింత పెరిగింది. మరోవైపు వెంకటేశ్వరుని ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు, కాలినడకన తిరుమల చేరుకునే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.