: హజారేను మించి పోరాడా..కిరణ్ కంటే నేనే బెస్టు: శంకర్రావు


అవినీతిపై అన్నా హజారేను మించి పోరాడానని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ నత్తి సీఎం కిరణ్, నత్తి బొత్సలకు వచ్చే నెల 7 తరువాత ఉద్వాసన తప్పదని అన్నారు. సీఎం కిరణ్ పార్టీ పెడితే ఆయన పాతాళానికి, ఆ పార్టీలో చేరిన వారు కైలాసానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. సీఎం మూడేళ్లలో పార్టీని భూస్థాపితం చేశాడని, అతని కంటే తానే బెస్టు అని శంకర్రావు తనకి తాను కితాబిచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News