: విదేశీ కార్మికులను తగ్గించే ఆలోచనలో సౌదీ ప్రభుత్వం


విదేశీ కార్మికులపై కొత్తచట్టాలతో ఆడుకుంటున్న సౌదీ ప్రభుత్వం తాజా చట్టం నతాఖాను విస్తరించే పనిలో పడింది. దీని ప్రకారం ఆ దేశ ప్రజలకు భారీ జీతభత్యాలు, ఉద్యోగావకాశాలు కల్పించిన తరువాతే విదేశీయులకు అవకాశాల కల్పనకు వీలు పడుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆ దేశంలో ఎనిమిది సంవత్సరాలు ఆపై ఉన్నవారందరిపై దీని ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు భార్య, ఇద్దరు పిల్లలతో ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులను ఇద్దరు విదేశీ కార్మికులుగా గుర్తిస్తారు. దీంతో వారికి ఇబ్బందులు తప్పవు.

మరో వైపు ఆరు వేల సౌదీ రియాల్స్ ను కానీ, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కానీ జీతభత్యాలుగా తీసుకునే వారిని కూడా పాయింట్ల ప్రకారం ఇద్దరు కార్మికులుగా గుర్తించనున్నారు. దీనిపై సర్వత్ర నిరసన వెల్లువెత్తుతున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News