: ఎన్నికల నిధుల కోసం 600 కోట్ల కుంభకోణం: గాలి


ఎన్నికల్లో నిధుల కోసం అధిష్ఠానం, ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లో ఆయన మాట్లాడుతూ గుర్తింపులేని సంస్థకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల అమరిక కాంట్రాక్టు అప్పగించారని తెలిపారు. ఢిల్లీ, హర్యానాల్లో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు 250 రూపాయలు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 650 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల పేరుతో 10 వేల మంది కార్మికుల పొట్ట కొట్టారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News