: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి చేరిన జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా
సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా లేఖ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపారు. నిన్న(సోమవారం) ఆ రాష్ట్ర గవర్నర్ ఎమ్ కె నారాయణ్ ను రాజ్ భవన్ లో కలిసిన గంగూలీ రాజీనామాను అందించారు. దాంతో, ఈ రోజు రాజీనామాను గవర్నర్ మమతకు పంపారు. న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తీవ్ర ఆరోపణల నేపథ్యంలోనే గంగూలీ బెంగాల్ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ పదవి నుంచి వైదొలగారు.