: రేపట్లోగా సీఎం పూర్తి సమాచారం ఇవ్వాలి: పయ్యావుల
సభలో టీబిల్లుపై చర్చకు సమగ్ర వివరాలు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. దీనికోసం ఆయనకు రేపటి వరకు సమయమిస్తున్నామని చెప్పారు. వివరాలను సీఎం ఇవ్వనట్టయితే ఆయనకు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేనట్టే అనుకుంటామని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ సమైక్య తీర్మానం అంటోందని... వారు తీర్మానం చేసి ఎవరికి పంపుతారు? దానివల్ల ఉపయోగమేమిటి? అని పయ్యావుల ప్రశ్నించారు.