: తెహల్కా పత్రిక మూసేస్తారా?
పరిశోధనాత్మక వార్తల పత్రికగా పేరొందిన తెహల్కా ను మూసివేస్తున్నారా? తెహల్కా పత్రిక మూసివేతపై ఏ విధమైన ప్రకటన వెలువడకపోయినా ఢిల్లీలో మాత్రం తెహల్కా పత్రికను మూసేస్తున్నారంటూ పుకార్లు షికారుచేస్తున్నాయి. తెహల్కా చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల కేసులో గోవా జైలులో ఉండడంతో, అతనిపై ఉచ్చు బిగుసుకుందని, పత్రిక నడిచే అవకాశం లేదని, ఆ సంస్థ ఉద్యోగులు కొందరు అంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ సర్క్యులేషన్ విభాగాన్ని మూసివేసినట్టు ఉద్యోగులు నిర్థారించారు. వారు కూడా పత్రికమూసేస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.