: గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ ను సందర్శించిన పనబాక లక్ష్మి
తూర్పు గోదావరి జిల్లాలోని ఎన్టీపీసీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ ను ఈరోజు (మంగళవారం) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి సందర్శించారు. మామిడికుదురు మండల పరిధిలోని తాటిపాకలో ఉన్న ఈ స్టేషన్ ను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె స్థానిక చమురు శుద్ధి కర్మాగారానికి వెళ్లారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయు నిక్షేపాల వివరాలను జనరల్ మేనేజర్ కృష్ణారావును ఆమె అడిగి తెలుసుకున్నారు.