: మాదకద్రవ్యాల వ్యాపారంలో పంజాబ్ రెవెన్యూ మంత్రి హస్తం


మాదకద్రవ్యాల వ్యాపారంలో పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ సింగ్ మజీతియా హస్తం ఉందని సాక్షాత్తూ కోర్టులోనే నిందితుడు చెప్పడం సంచలనం కలిగిస్తోంది. అక్కడితో అతను ఆగలేదు. కోట్లాది వ్యాపారం మొత్తం అతని కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆ విషయం పోలీసులకు కూడా తెలుసని చెప్పాడు. గత నవంబర్ లో జగదీష్ భోలా అనే వ్యక్తి మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిని న్యాయస్థానంలో హాజరుపర్చగా నేరుగా జడ్జి వద్దే ఈ వ్యాఖ్యలు చేశాడు. కావాలంటే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని భోలా సూచించాడు. దీనిపై బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ, జగదీష్ పేరొందిన నేరగాడని, అతడు చేసిన నేరాలకు జీవితఖైదు శిక్షపడే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తి మాటలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News