: మైక్రోమ్యాక్స్ లాప్ ట్యాబ్ వచ్చేస్తోంది..
మైక్రోమ్యాక్స్ ల్యాప్ టాప్, టాబ్లెట్ రెండింటి కలయికలతో లాప్ ట్యాబ్ ను వచ్చే నెలారంభంలో విడుదల చేయనుంది. ఇందులో ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు విండోస్8 కూడా ఉంటుంది. ఏది కావాలనుకుంటే దానికి 'స్విచ్ యూజర్' ఆప్షన్ తో మారిపోవచ్చు. 10.1అంగుళాల స్క్రీన్, 1.46 గిగాహెడ్జ్ ఇంటెల్ సెల్రాన్ ఎన్2805 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 7400 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, బ్లూటూత్, వైఫై సదుపాయాలు కూడా ఉన్నాయి. లాప్ ట్యాబ్ పై కవర్ నే కీబోర్డుగానూ ఉపయోగించుకోవచ్చు.