: దియామీర్జా పెళ్లి మళ్లీ వాయిదా
బాలీవుడ్ నటి దియామీర్జా పెళ్లికి ముహూర్తం కలిసి రావడం లేదు. పాపం రెండోసారి కూడా వివాహం వాయిదా పడింది. తన ప్రియుడు సాహిల్ సంఘతో మొదటి సారిగా గతేడాది నవంబర్ లో పెళ్లికి ముహూర్తం పెట్టుకోగా.. అప్పుడు దియా తల్లి దీపామీర్జా అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఈ నెల మొదట్లో చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడేమో దియా తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వీరి పెళ్లి మళ్లీ వాయిదా పడింది. ఈ నెల చివర్లో ఎలాగైనా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈసారైనా వివాహ ఘడియలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.