: మన నేతలకు కనీస విషయాలు కూడా తెలియవా?: వైఎస్ వియమ్మ
రాష్ట్ర విభజనపై ముందుగా అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తరువాతే రాష్ట్రాలను ఏర్పాటు చేశారన్న విషయం మన నేతలకు తెలియదా? అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ బిల్లుపై చర్చకు తాము వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని, అయితే చర్చకంటే ముందు సమైక్యతీర్మానం చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. బీహార్ లో తీర్మానం పెట్టకముందు వచ్చిన బిల్లును వెనక్కి తిప్పిపంపిన సంగతి మన నేతలకు తెలియదా? అని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాతే రాష్ట్ర విభజన జరిగిందని ఆమె తెలిపారు.