: తొమ్మిది నెలలు దాచి... స్కూల్లో ప్రసవించిన టెన్త్ విద్యార్థిని


పాఠశాలలు వివాదాలకు వేదికలవుతున్నాయి. విద్యనేర్పాల్సిన గురువుల తప్పిదమో లేక విద్య నేర్చిన విద్యార్థుల తప్పిదమో కానీ జరగకూడని దారుణాలు జరిగిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో 11 మంది విద్యార్థినులపై జరిగిన లైంగిక దాడి ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లా పిట్లం కస్తూర్బా గురుకుల పాఠశాలలో మరో దారుణం చోటు చేసుకుంది.

తెలిసో, తెలియకో, ఎవరిదో ప్రోద్బలంతో వేసిన తప్పటడుగు కారణంగానో ఓ బాలిక గర్భం దాల్చింది. ఎలా దాచిందో తెలియదు, లేక పాఠశాల వారికి తెలిసినా దాచారో తెలియదు కానీ ఈ ఉదయం స్కూల్లోనే ప్రసవించింది. వెంటనే పుట్టిన శిశువును ముళ్ల పొదల్లోకి విసిరేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News