: ఓటింగ్ నిర్వహిస్తే అది సమైక్యానికి అనుకూలంగా మారుతుంది: ఎర్రబెల్లి


ప్రస్తుత పరిస్థితుల్లో టీబిల్లుపై చర్చ జరగకపోతేనే తెలంగాణకు మంచిదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అభిప్రాయపడ్డారు. బిల్లులోని ప్రతి క్లాజుపై చర్చ జరిపి, ఓటింగ్ నిర్వహిస్తే అది సమైక్యానికి అనుకూలంగా మారుతుందని అన్నారు. అందుకే సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల ఇద్దరూ చర్చల పేరుతో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ స్పష్టమైన వైఖరితోనే ఉందని ఎర్రబెల్లి తెలిపారు. సీమాంధ్ర టీడీపీ నేతలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News