: మూడు వ్యాన్లలో జయలలిత నగలు తరలింపు


మూడు వ్యాన్లు.. అందులో ఏమున్నాయనుకుంటున్నారు? నగలు. అవును మూడు వ్యాన్లలోనూ నగలే ఉన్నాయి. అవి మరెవరివో కావు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితవి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు చెన్నైనుంచి బెంగళూరుకు జయలలిత నగలను తరలిస్తున్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు నిన్న బెంగళూరు నుంచి ఒక బృందం కూడా వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆభరణ ప్రియులన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News