: తలగడతో ఛార్జింగ్ చేసుకోవచ్చు..
అవును నిజమే.. సాధారణ తలగడలా కనిపించే ‘పవర్ పిల్లో’ ద్వారా సెల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. కెనడాకు చెందిన ఇద్దరు డిజైనర్లు ఈ తలగడను రూపొందించారు. ‘పవర్ పిల్లో’తో మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీలతో పాటు రెండు యూఎస్ బీ పోర్టులను అమర్చారు. వీటి సహాయంతో ముందుగా పవర్ పిల్లోను ‘చార్జ్’ చేసుకొని.. దీని ద్వారా మన సెల్ ఫోన్లను ఎంచక్కా చార్జింగ్ చేసుకోవచ్చు.