: అసెంబ్లీలో చర్చను కొనసాగించాలి: బీజేపీ
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చను కొనసాగించాలని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుపడుతున్న సభ్యులను.. సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం రాకుండా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని లక్ష్మీనారాయణ విమర్శించారు.