: జనవరి 10 నుంచి ఆమ్ ఆద్మీ దేశవ్యాప్త ప్రచారం
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు రానున్న లోక్ సభ ఎన్నికలకు జనవరి 10 నుంచి దేశవ్యాప్త ప్రచారం చేపట్టాలని ఆమ్ ఆద్మీ నిర్ణయించింది. 15న తొలివిడత లోక్ సభ అభ్యర్ధుల జాబితా ప్రకటించనుంది. ఈ నెల 10 నుంచి 26వ తేదీ వరకు సభ్యత్వ నమోదు చేయనున్నట్లు ఏఏపీ ఇంతకు ముందే ప్రకటించిన విషయం విదితమే.