: కుటుంబ సభ్యుల, సినీ పరిశ్రమ పెద్దల తీరుపై ఉదయ్ కిరణ్ అభిమానుల మండిపాటు


సినీ నటుడు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన బంధువులు గానీ, సినీ పరిశ్రమ పెద్దలు కానీ ముందుకు రాకపోవడం పట్ల ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేసిన అనంతరం నిమ్స్ మార్చురీకి తరలించారు. అక్కడ మార్చురీకి తాళం వేసి ఉండడంతో మృతదేహం సుమారు 20 నిమిషాల పాటు బయటే ఉండిపోయింది. ఉదయ్ బ్రతికి ఉండగా సినీ పెద్దలు కక్షసాధింపులకు పాల్పడ్డారని, కనీసం అంత్యక్రియల సమయంలోనైనా సరిగ్గా వ్యవహరించడం లేదని అభిమానులు మండిపడ్డారు.

కాగా ఆయన మృతదేహం తీసుకెళ్లేందుకు ఉదయ్ కిరణ్ తండ్రి కానీ, ఆయన భార్య కానీ రాకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ సోదరి మస్కట్ నుంచి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆమె వచ్చిన అనంతరం అంత్యక్రియలపై ఓ స్పష్టత వస్తుంది. కాగా, పంజాగుట్టలోని స్మశానవాటికలో మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News