: బీజేపీ గెలుపే లక్ష్యంగా.. ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ బీజేపీ’
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) గెలుపే లక్ష్యంగా ప్రవాస భారతీయులు పనిచేస్తున్నారు. అందుకోసం అమెరికాలో నివసిస్తున్న కొంతమంది కలిసి ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ బీజేపీ’గా ఏర్పడ్డారు. ఈ బృందంలో పనిచేస్తున్న వారు ఒక్కొక్కరు 200 మందికి ఫోన్ చేసి బీజేపీ గెలుపుకోసం మద్దతు కూడగడుతున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రకాంత్ పటేల్ చెప్పారు. నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించడమే లక్ష్యంగా వేలాది మంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. వీరంతా అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.