: చర్చ జరగాల్సిందేనన్న ప్రభుత్వం, టీఆర్ఎస్.. సమైక్య తీర్మానమన్న వైఎస్సార్సీపీ
స్పీకర్ కార్యాలయంలో రెండోదఫా జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే జరిగిన సమావేశంలో.. ఈసారి కూడా ముసాయిదా బిల్లుపై చర్చకు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తే.. బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ప్రభుత్వం, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అసలు బిల్లును తిప్పి పంపాలని సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడితే, బిల్లుపై చర్చకు అడ్డుపడుతున్న వారిని సస్పెండ్ చేసి కొనసాగించాలని తెలంగాణ ప్రాంత టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంలో తెలిపారు. అంతకుముందు సమావేశం మొదలైన కొద్దిసేపటికే టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వెళ్లిపోయారు.