: ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సిందే: ఎర్రబెల్లి


శాసన సభలో చర్చ జరగాల్సిందేనని ఎర్రబెల్లి దయాకరరావు తేల్చి చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు సంబంధించి ప్రభుత్వంలోనే రెండు వాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లుపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు అడ్డుపడితే.. వారిని బయటకు పంపి చర్చ కొనసాగించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంత అభివృద్ధి కి సంబంధించిన అంశాలపై సభలో ప్రస్తావించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News