: ఆనంతో బొత్స, వట్టి భేటీ
ఆర్ధిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డితో మంత్రి బొత్స సత్యనారాయణ, వట్టి వసంత కుమార్ లు భేటీ అయ్యారు. బిల్లుపై చర్చ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినా టీడీపీ, వైఎస్సార్సీపీలు అడ్డు పడుతుండడంతో వారిని ఏ విధంగా ఎదుర్కొని, ఇరుకున పెట్టాలా? అని వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ అభిప్రాయాలతో ముసాయిదా బిల్లును పంపించాలని అధిష్ఠానం నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో వారు భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారని సమాచారం.