: ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి


మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను నిర్ణయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల ఐక్య కార్యాచరణ సమితి 10వ వేతన సవరణ సంఘం చైర్మన్ పీకే అగర్వాల్ కు విజ్ఞప్తి చేసింది. ఈ జూలై కల్లా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి అమల్లోకి వచ్చేలా చేయాలని కోరింది. ఈ మేరకు ఐక్యకార్యాచరణ సమితి నేతలు సచివాలయంలో అగర్వాల్ ను కలిసి విన్నవించారు.

ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం వస్తువుల ధరలు 300శాతం పెరిగిపోయాయని, దీంతో వేతనాలు చాలక ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వేతనాల సవరణపై నివేదిక ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో అందరికీ న్యాయం చేస్తానని అగర్వాల్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను వచ్చే నెలాఖరులోగా లిఖిత రూపంలో తెలియజేయాలని కోరారు.  

  • Loading...

More Telugu News